తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటానికి తీసుకెళ్లింది టీఆర్‌ఎస్ పార్టీ.. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ దీక్ష చేయబోతున్నారు.. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్షకు సిద్ధమయ్యారు.. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష చేస్తోంది.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.. అయితే, బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్.
Read Also: AP Cabinet: పాత మంత్రులకు పాత శాఖలే..!
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో వరి దీక్ష.. బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో వరి దీక్ష.. అని ఎద్దేవా చేసిన మధు యాష్కీ.. దీక్షలు చేసేటోళ్లకు సిగ్గుండాలి.. అధికారంలో ఉన్నోళ్లు రైతులును ఖర్మానికి ఇడ్సిపెట్టి దీక్షలు చేస్తే.. వడ్లు ఎవడు కొనాలి..? అని ఫైర్ అయ్యారు. రైతులను ఎవడు ఆదుకోవాలి?? అని ప్రశ్నించిన యాష్కీ.. ఢిల్లీకి వేలమందితో పోయి దీక్షలు చేసేసోటిడికి.. ఆ మొత్తం పెట్టి వడ్లు కొనొచ్చు కదా? అని నిలదీశారు.. దొంగడ్రామాలు .. వీధి నాటకాలతో రైతుల బతుకులు ఆగం జేస్తున్నారు.. వరి రైతులకు ఉరేస్తున్న వీళ్లను పాతాళానికి బొందపెడ్తేనే రాష్ట్రం.. రైతాంగం బాగుపడుతుందన్నారు మధు యాష్కీ.
