Site icon NTV Telugu

Jaggareddy: గుళ్లు.. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది..

Congress Working President

Congress Working President

కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. గుళ్లు.. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తా అన్నారు.. దీనిపై సమాధానం ఏంటని అడిగారు. భాగ్యలక్ష్మి గుడికో.. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి రాష్ట్ర బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చిన నేతలను తిప్పుడు కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటో సమాధానం చెప్పాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు.

ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజుకి దండేసి వస్తారా..?. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే ప్రకటన చేస్తారా…? అంటూ ప్రశ్నించారు. గుళ్లు.. దేవుళ్ల పేరుతో అభివృద్ధి అనేది పక్కనపెట్టి… బీజేపీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హామీలను తుంగలో తొక్కి దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి టెంపుల్‌కి వెళ్తున్నారని.. యోగి ప్రజల మనిషే అయితే ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అమ్మవారిని మొక్కాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తా అని మొక్కుకోవాలని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా ఇచ్చిన హామీ అమలు చేయాలని అడగాలంటూ ఆకాంక్షించారు.

ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు. యోగి లేదా జగ్గారెడ్డి వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని మొక్కితే ప్రజల కడుపు నిండుతుందా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?

 

Exit mobile version