దళిత బంధుతో దగా.. ఎన్నో చెప్పారు.. ఏమైంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి.. కేసీఆర్ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే తల నరుక్కుంటా అన్నారన్న ఆమె.. డిప్యూటీ సీఎం రాజ్యను ఎందుకు కేబినెట్ నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. సబ్ ప్లాన్ ఫండ్స్ కోసం ఏడేళ్లుగా రూ.85,913 కోట్లు కేటాయించారు.. కానీ, ఏడేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.47,685 కోట్లు మాత్రమే.. మిగతా రూ.38 వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వాటిని ఎక్కడ వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు గీతారెడ్డి.
సబ్ ప్లాన్ అమలుకోసం నోడల్ కమిటీ, స్టేట్ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా పెట్టని వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు గీతారెడ్డి.. కేటాయించిన డబ్బులే ఖర్చు చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇంటికి రూ. 10 లక్షలు ఇస్తారా..? అని ప్రశ్నించారు. లోన్ల కోసం 5.33 లక్షల మంది దరఖాస్తు చేస్తే.. అందులో 1.16 లక్షల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారని గుర్తుచేసిన ఆమె.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని విమర్శించారు. మరోవైపు.. దళిత బంధు అంబేద్కర్ విగ్రహానికి ఏడేళ్లుగా కనీసం పూల మాల వేశారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు గీతారెడ్డి.. ప్రగతి భవన్ లో దళితులను పిలిచి మాత్రం అంబేద్కర్ బొమ్మకి మాత్రం పుల మాల వేశారన్న ఆమె.. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌కే పరిమితం చేయొద్దని.. రాష్ట్రంలో ఉన్న దళితుల అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!