NTV Telugu Site icon

Revanth Reddy: బీఆర్‌ఎస్‌ 25, ఎంఐఎం 7, బీజేపీ 9 లోపే.. మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే

Revanth Reddy Gandhi Bhavan

Revanth Reddy Gandhi Bhavan

Revanth Reddy: తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్‌ కి 25 లోపే సీట్లు వస్తాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఇక ఎంఐఎం 7, బీజేపీ 9 లోపు సీట్లు వస్తాయని ఇక మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే అని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నాటక లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కేసీఆర్ పని చేశారని అన్నారు. అస్థిర రాజకీయాలతో తన రాజకీయాలను సుస్థిరం చేసుకోవాలని అనుకుంటారని తెలిపారు. కర్ణాటక ప్రజలు క్లారిటీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా క్లియర్ మెజారిటీ కాంగ్రెస్ కి వస్తుందని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి 25 లోపే సీట్లు, ఎంఐఎం 7, బీజేపీ 9లోపు సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లు కాంగ్రెస్ వే అని జోష్యం చెప్పారు. కర్ణాటక ఫలితాలు నేను చెప్పినట్టే వచ్చాయని రేవంత్‌ పేర్కొ్న్నారు. తెలంగాణలో నేను చెప్పింది జరుగుతుందని అన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్ కె పరిమితం అయ్యిందని అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిపి 30 నుండి 35 సీట్లు గెలుచుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. మీరు ఎవరికి ఓటేసినా నేను కొంటా అనే భయం పెట్టారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఫ్యాక్షన్ సినిమాలో కిరాతకంగా హత్య చేసినట్టు.. కేసీఆర్ ని తెలంగాణ జనం కూడా ఎన్నికల్లో అట్లా ఓడిస్తారని రేవంత్ తెలిపారు.

Read also: K. A. Paul: ప్రార్థించాం.. ఓడించాం.. కర్ణాటకను రక్షించాం

జేడీఎస్‌ ఓటమితో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జొడో యాత్ర ఫలితం కర్నాటక గెలుపుగా తీసుకెళ్లిందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ సమాధానం చెప్పాలని, జేడీఎస్‌ ఇక ఎటు వైపు ఉంటుందో అని ఎద్దేవ చేశారు. బీజేపీ తో జతకట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు. అలా అయితే.. ఆయన మైత్రి ఏంటో బయట పడుతుందన రేవంత్‌ పేర్కొన్నారు. బీజేపీ ఓడిపోయింది కర్నాటకలో, ఇక్కడ కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్‌ ఓడిపోయిందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్‌ ఓటమి తో.. కేసీఆర్ ఓడిపోయినట్టు అంటూ రేవంత్‌ పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని రేవంత్‌ అన్నారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడని తెలిపారు. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని రేవంత్ తెలిపారు.
Revanth reddy: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్

Show comments