Ponnam Prabhakar: వేములవాడ రాజన్నను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు అది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న.. రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు.. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh : హోటల్‌లో డాక్టర్ డిజిటల్ అరెస్టు.. రూ.50లక్షలు పోకుండా కాపాడిన పోలీసులు
ఇక, విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం నిర్మాణానికి 35 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని చెప్పారు. 35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయలు ఉన్నాయి.. దానిని వంద కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది ఈ ప్రాంత ప్రజలది అన్నారు. అలాగే, మా కుటుంబం తరపున 40 లక్షల రూపాయలను ఆ రాజన్న స్వామి వారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు.
Read Also: AP Government: వారికి గుడ్‌న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
అలాగే, రాజరాజశ్వర స్వామి భక్తులుగా డోనర్స్ ఉంటే విరాళాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వండి అన్నారు. లేదంటే, స్థానిక ఎమ్మెల్యేలు, ఈవోనీ కలిసి విరాళాలు ఇవ్వొచ్చు అని తెలిపారు. ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిత్యాన్నదాన సత్రం విజయవంతం కావాలన్నారు. అందరు సహకరించండి.. వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి విరాళాలు ఏవి ఇచ్చిన సరే.. రైతులు బియ్యం, కూరగాయలు కూడా ఇవ్వొచ్చు అని ఆయన తెలిపారు. అన్ని పార్టీల వాళ్లు ఎవరెవరు ఆర్థికంగా ఉన్న ఆ దేవాలయానికి వెచ్చిస్తే సంతోషంగా..
మేము ఇద్దరం కలిసి హైదరాబాద్ లో డోనర్స్ ను కలుస్తాం.. వేములవాడ దర్శనంలో కోడె టికెట్, అభిషేకం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాం.. తిరుపతి లాగ అందరికీ టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు అన్నారు. శ్రీశైలంలో ఉన్నట్లే మ్యూజికల్ ఫౌంటెన్ వేములవాడలో లార్డ్ శివ ఉండేలా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.