Conductor Srividya: బండ్లగూడ డిపో డీఎం వేధింపుల వల్లే ఆత్మహత్య.. కండక్టర్ శ్రీవిద్య తల్లి ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Conductor Srividya: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య గత 12 ఏళ్లుగా బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీవిద్యను ఈ నెల 12న సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. డిప్రెషన్ కారణంగా ఆమె బీపీ మాత్రలు ఎక్కువగా వేసుకుంది. ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు కమీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. ఆమె ఆత్మహత్యపై కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించారు. కాగా, అధికారుల వేధింపుల వల్లే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద ధర్నాకు దిగారు. కండెక్టర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిస్కరించి నిరసన చేపట్టారు.
కండక్టర్ శ్రీవిద్య తల్లి..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
పదేళ్ళుగా కండక్టర్ గా పని చేస్తుందని కండక్టర్ శ్రీవిద్య తల్లి తెలిపారు. నా ఇద్దరు కూతుళ్ళు ఆర్‌టిసిలోనే చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఉన్న బండ్లగూడ డిపో డీఎం వేధింపులకు గురిచేస్తుందని తెలిపారు. కలెక్షన్ రావడం లేదంటూ నా కూతురును వేధించిందని కన్నీరుపెట్టుకున్నారు. పనిష్మెంట్ డ్యూటీ అంటూ హయత్‌నగర్ టూ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవిద్య కూతురు పెళ్ళి ఈ నెలలోనే ఉందని కన్నీరుమున్నీరయ్యారు. పెళ్ళి ఉన్న సమయంలో ఇలా పనిష్మెంట్ డ్యూటీ అని తెలిస్తే పరువు పోతుందని అనుకుందని అన్నారు. అవమానభారం తట్టుకోలేకే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని గుండెలు పగిలేలా రోదించారు. అధికారులు వేధింపులు తాళలేక కండక్టర్ శ్రీవిద్య సూసైడ్ చేసుకుందని వాపోయారు. న్యాయం చేయాలని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేయాలని, తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా.. అధికారులు వేధింపులను ఖండిస్తూ లేడి కండక్టర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ డిపో ముందు బైఠాయించిన కండక్టర్లు నిరసన తెలిపారు. దీంతో డిపోకే పబస్సులు రిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు కండక్టర్లు ఆందోళన చేపట్టారు.
బండ్లగూడ ఆర్టీసీ డీవీఎం మాట్లాడుతూ..
కండక్టర్ శ్రీవిద్య అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందని తెలిసిందన్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని స్పష్టం చేశారు. రోజు రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే పడుకుంటుందని తెలిసిందని అన్నారు. సిబ్బంది పై వేధింపులకు గురి చేసే అవకాశం లేదని తెలిపారు. సిబ్బంది వెల్ఫేర్ కమిటీ ఉంది, సమస్యలు ఉంటే చెప్పుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో బదిలీ ఎలా చేస్తాం? అని ప్రశ్నించారు. హయత్‌నగర్‌కు బదిలీ చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Allu Arjun: బన్నీ డే… ఢిల్లీలో పుష్పగాడి రూల్!
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..