NTV Telugu Site icon

Conductor Srividya: బండ్లగూడ డిపో డీఎం వేధింపుల వల్లే ఆత్మహత్య.. కండక్టర్ శ్రీవిద్య తల్లి ఆవేదన

Conductor Srividya

Conductor Srividya

Conductor Srividya: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య గత 12 ఏళ్లుగా బండ్లగూడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీవిద్యను ఈ నెల 12న సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. డిప్రెషన్ కారణంగా ఆమె బీపీ మాత్రలు ఎక్కువగా వేసుకుంది. ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు కమీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. ఆమె ఆత్మహత్యపై కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించారు. కాగా, అధికారుల వేధింపుల వల్లే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద ధర్నాకు దిగారు. కండెక్టర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విధులు బహిస్కరించి నిరసన చేపట్టారు.

కండక్టర్ శ్రీవిద్య తల్లి..

పదేళ్ళుగా కండక్టర్ గా పని చేస్తుందని కండక్టర్ శ్రీవిద్య తల్లి తెలిపారు. నా ఇద్దరు కూతుళ్ళు ఆర్‌టిసిలోనే చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఉన్న బండ్లగూడ డిపో డీఎం వేధింపులకు గురిచేస్తుందని తెలిపారు. కలెక్షన్ రావడం లేదంటూ నా కూతురును వేధించిందని కన్నీరుపెట్టుకున్నారు. పనిష్మెంట్ డ్యూటీ అంటూ హయత్‌నగర్ టూ‌ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవిద్య కూతురు పెళ్ళి ఈ నెలలోనే ఉందని కన్నీరుమున్నీరయ్యారు. పెళ్ళి ఉన్న సమయంలో ఇలా పనిష్మెంట్ డ్యూటీ అని తెలిస్తే పరువు పోతుందని అనుకుందని అన్నారు. అవమానభారం తట్టుకోలేకే నా కూతురు ఆత్మహత్య చేసుకుందని గుండెలు పగిలేలా రోదించారు. అధికారులు వేధింపులు తాళలేక కండక్టర్ శ్రీవిద్య సూసైడ్ చేసుకుందని వాపోయారు. న్యాయం చేయాలని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేయాలని, తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా.. అధికారులు వేధింపులను ఖండిస్తూ లేడి కండక్టర్ల ఆందోళన చేపట్టారు. బండ్లగూడ డిపో‌ ముందు బైఠాయించిన కండక్టర్లు నిరసన తెలిపారు. దీంతో డిపోకే పబస్సులు రిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు కండక్టర్లు ఆందోళన చేపట్టారు.

బండ్లగూడ ఆర్టీసీ డీవీఎం మాట్లాడుతూ..

కండక్టర్ శ్రీవిద్య అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందని తెలిసిందన్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని స్పష్టం చేశారు. రోజు రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటేనే పడుకుంటుందని తెలిసిందని అన్నారు. సిబ్బంది పై వేధింపులకు గురి చేసే అవకాశం లేదని తెలిపారు. సిబ్బంది వెల్ఫేర్ కమిటీ ఉంది, సమస్యలు ఉంటే చెప్పుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో బదిలీ ఎలా చేస్తాం? అని ప్రశ్నించారు. హయత్‌నగర్‌కు బదిలీ చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Allu Arjun: బన్నీ డే… ఢిల్లీలో పుష్పగాడి రూల్!