NTV Telugu Site icon

Ranga Reddy:స్కూల్ బస్సు బీభత్సం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం

???????? ?????? ?????????????

???????? ?????? ?????????????

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్ పేట్ లో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కండర్ షైర్ స్కూల్ కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో.. స్కూల్ సెక్యూరిటీ గార్డుపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో.. పెనుప్రమాదం తప్పినట్లయింది.

కాగా.. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదం గురించి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులపై సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే ఇటువంటి ఘ‌ట‌నే Feb 17, 2021న హైదరాబాద్ మహానగరంలో టోలిచౌకి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అతి వేగంగా వచ్చిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు టోలిచౌకి ప్రాంతంలో వాహనాలపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఏడు వాహనాలను ఢీకొనడంతో, అందులో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Shantha kumari :నాటి మేటి నటి శాంతకుమారి!