DAV School: హైదరాబాద్ లో ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులు సంచళంగా మారినవిషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఎల్ కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బిఎస్ డి డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలనీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేసించిన విషయం తెలిసిందే. దీంతో.. తల్లిదండ్రులకు తల నొప్పిగా మారింది సంవత్సరం మధ్యలో పిల్లలను స్కూల్ మారిస్తే విద్యార్థుల ఎలా చదువుతారు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు తప్పు చేస్తే.. పిల్లలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే.. చుట్టుపక్కల ఇలాంటి స్టాండెడ్ స్కూల్‌లు లేవని, వేరే స్కూల్‌లో చేరిన డోనేషన్స్.. ఫీజ్‌లు తప్పవని తెలిపారు. వేరే స్కూల్‌లలో సర్దుబాటు చేయడం కంటే, స్కూల్ యాజమాన్యాన్ని మార్చి.. సెక్యూరిటి ఏర్పాటు చేసి ఈస్కూల్‌ను కంటిన్యూ చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే ఈ అకడమిక్ ఇయర్ తరవాత క్లోజ్ చేస్తే, వేరే స్కూల్ చూసుకుంటామని తల్లిదండ్రులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read also: TSLPRB: SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. పార్ట్-2 దరఖాస్తుల స్వీకరణ అప్పుడే..
ఈనెల 19న (బుధవారం) ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు డ్రైవర్ రజనీకుమార్. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజిని కుమార్ తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవిపై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. గత పన్నెండేళ్ళుగా ఇదే స్కూళ్ళో క్లీనర్ గా, డ్రైవర్ గా పని చేస్తున్నాడు రజినీకుమార్ తెలిపారు స్కూల్ యాజమాన్యం.
KA Paul: రెస్పెక్ట్ ఇవ్వండి.. నేను తెలంగాణకు కాబోయే సీఎంను..!