KTR: తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్‌కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్‌ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
తన మాట ప్రకారమే కేటీఆర్ ముందుగా తెలంగాణ భవన్ చేరుకుని, అనంతరం ప్రెస్ క్లబ్‌కు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని, రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 18 నెలలుగాకాంగ్రెస్ అరచాకాలను ఎండగడుతున్నామని, అసెంబ్లీ లో చర్చ పెట్టమని ఆడిగామన్నారు. సీఎంరేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రండి సవాల్ విసిరారని, 72 గంటల సమయం ఇచ్చామన్నారు కేటీఆర్. సోమజిగూడా ప్రెస్ క్లబ్ కు చర్చ కు రమ్మని చెప్పామని, చర్చించడానికి వెళుతున్నామన్నారు. సీఎం వేస్తారేమో అనుకున్నామని, ఢిల్లీ కి వెళ్లారు.. ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దామన్నారు. ఎవరితో అయినా సిద్ధమే ఈ రోజు కాకపోయినా మరోరోజు అయినా సీఎం రావచ్చని ఆయన అన్నారు. రేపు అసెంబ్లీలో పెడతాం అని సీఎం మాటిస్తే మేము సిద్ధమని, మీకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి.. కేసీఆర్ వచ్చి పాలన చేస్తారన్నారు కేటీఆర్.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్‌కు రావచ్చన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరపడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం, పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
Tamil Nadu: ఘోర విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రైన్.. ఇద్దరు విద్యార్థుల మృతి
