NTV Telugu Site icon

Revanth Reddy: కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..?

Revanth Reddy, Kcr

Revanth Reddy, Kcr

Revanth Reddy: కవిత..కేసీఆర్ కూతురు.. కూతురు ఇంటికి పోలీసుల వెళ్లి అరెస్ట్ చేస్తుంటే.. కవిత ఇంటికి తండ్రిగా రావాలి కదా? అని ప్రశ్నించారు. తండ్రిగా కాకుండా పార్టీ అధ్యక్షుడుగా నైనా వెళ్ళాలి కదా? అని ప్రశ్నించారు. ఎప్పుడు మొదట ఈడీ..తర్వాత మోడీ రావాలి, కానీ నిన్న మోడీ.. ఈడీ ఒక్కటే సారి వచ్చారని తెలిపారు. చీఫ్ పొలిటికల్ పాలిటిక్స్ చేస్తున్నారు మోడీ..కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ.. తెలంగాణ హామీలు ఎందుకు అమలు చేయలేదు? కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి బీజేపీ.. బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నారని తెలిపారు. కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? నాటకం కాకుంటే అంటూ మండిపడ్డారు. కవిత అరెస్ట్ మోడీ కూడా ఎందుకు ప్రస్తావన చేయలేదు? అని ప్రశ్నించారు.

కేసీఆర్.. కవిత అరెస్ట్ ని కండించలేడు.. మోడీ కనీసం స్పందించలేదని అన్నారు. ఆ ఇద్దరి విధానం తరవాత.. ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్.. రెండు పార్టీల ఎత్తుగడలో భాగమే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 8 లక్షల మంది మహిళలకు ఇప్పటికే 500 కి సిలిండర్ ఇచ్చామన్నారు. 200 యూనిట్ విద్యుత్..37 లక్షల మందికి జీరో బిల్లులు అన్నారు. మహబూబ్ నగర్ లో ఎన్నికల కోడ్ వల్ల 200 యూనిట్ అందుబాటులోకి రాలేదన్నారు. మూడు నెలల్లో ముపై వేళా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతికి అడ్డాగా ఉండేది.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రగతి భవన్ నిషేధిత ప్రాంతంగా ఉండేదన్నారు.

Read also: IPL 2024: సీఎస్‌కేకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయర్ దూరం!

ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. సెక్రటేరియట్ మీది.. అని ఓపెన్ చేశామన్నారు. ధర్నా చౌక్ ని ఓపెన్ చేశాం.. బీఆర్ఎస్ నేతలు కూడా ధర్నా చేసుకునే వీలు కల్పించామన్నారు. మార్పు మొదలయ్యింది.. మారు మూల గ్రామాలకు చేరుతుందన్నారు. 100 రోజుల్లో తెలంగాణ భాగస్వామ్యం ఉన్న అందరిని సచివాలయం రప్పించామన్నారు. రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు కూడా మెరుగు పరిచామని తెలిపారు. ఢిల్లీలో భవనాల పంపకాలు కూడా పూర్తి చేశామన్నారు. కేంద్రంతో పంథానికి పోవద్దని నిర్ణయం.. పంథానికి పోతే రాష్ట్రానికి నష్టమని తెలిపారు. అందుకే సయోధ్యతో పని చేయాలని మా విధానం అన్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలిసి పని చేయాలి అనుకున్నామన్నారు.

పక్క రాష్ట్రంతో కూడా ఘర్షన కాకుండా సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. టీవీలో సీరియల్ లాంటిది లిక్కర్ స్కామ్ అన్నారు. నిరంతరం కొనసాగేలా సీరియల్ డ్రామా చేశారు బీజేపీ.. బీఆర్ఎస్ నేతలు అంటూ మండిపడ్డారు. అరెస్ట్ డ్రామా తో..పతాక స్థాయికి డ్రామా వెళ్ళిందన్నారు. మోడీ చౌక బారు విమర్శలు సరికాదన్నారు. 10 ఏండ్లు సీఎం గా చేశారు.. రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసిన మోడీ కి తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణా అనే మాట మాట్లాడే అర్హత కూడా లేదు మోడీకి అని మండిపడ్డారు. 10 ఏండ్ల కేసీఆర్ అవినీతి పై ఎందుకు మోడీ కేసు పెట్టలేదన్నారు.
IPL 2024: రోహిత్ శర్మ గొప్ప లీడర్.. కెప్టెన్సీ నుంచి తొలగించడం షాక్‌కు గురి చేసుంటుంది!