Buddha Venkanna: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. తనకు అక్కనుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందని తెలిపారు.
ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందని బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. యువకులంతా వైసీపీకి పాడి కట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే WWF పెడతారని సంచలన వ్యాఖ్యలుచేశారు. మూడేళ్ళ క్రితమే కొడాలి నాని కేసినో, అస్లీల డ్యాన్సులు అడ్డు ఆడేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన పిచ్చికుక్క అన్నారు.
టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్ళాడని తెలిపారు. చంద్రబాబు గానీ, టీడీపీ గానీ తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. గాంధీభవన్ దగ్గర టీడీపీ జెండాలు కనపడితే చంద్రబాబు కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే ఇకపై జగన్ ను విమర్శిస్తాం మని హెచ్చరించారు.
పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎం దే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Man Kills Mother: భూమిని ఇవ్వడం లేదని తల్లి తలనరికి చంపిన కసాయి..
వైసీపీ వాళ్ళు కర్రలు,కత్తులు పడితే మేము కూడా అలాగే సమాధానం చెప్తామని తెలిపారు. చంద్రబాబుకు సత్తా ఉంది కాబట్టి ప్రధానులను కూడా తయారుచేసాడని అన్నారు. తెలంగాణ ఎన్నికలు చూసి రాష్ట్రం వదిలి పారిపోయేందుకు చాలామంది సిద్ధమవుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు దేశం వదిలి వెళ్ళిన లాక్కొచ్చి శిక్ష వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని అన్నారు. బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందన్నారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నానని తెలిపారు. బెజవాడ పశ్చిమ సీటుపై బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని ప్రకటించారు. సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని తెలిపారు. బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందని, చంద్రబాబు కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నానని తెలిపారు.
Free bus rides: ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించాలి.. యూపీ మహిళల డిమాండ్