CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సర్పంచ్‌లకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు (Special Development Fund) అందుతాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, ప్రతి పెద్ద గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాధారణంగా వచ్చే నిధులకు ఇది అదనమని, దీనివల్ల గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. లిస్ట్-Aలో 16,000 పరుగుల మైలురాయి..!
ఈ సందర్భంగా సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేసిన సీఎం, ఎన్నికల సమయం ముగిసినందున ఇకపై గ్రామాల్లో రాజకీయ పంతాలకు, పార్టీల వివక్షకు తావు ఉండకూడదని హితబోధ చేశారు. ఎదుటి పార్టీ నుంచి గెలిచిన వారైనా సరే, అందరినీ కలుపుకుని పోతేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, వివక్ష చూపితే అభివృద్ధి నిలిచిపోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులు లేని అర్హులైన వారందరి పేర్లను నమోదు చేయాలని, వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందరికీ వర్తించేలా, అర్హులు ఉండి కూడా లబ్ధి పొందని వారి జాబితాను సిద్ధం చేయాలని సర్పంచ్‌లను ఆదేశించారు. ప్రజా రవాణాలో మహిళల సౌకర్యం గురించి మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళల హక్కు అని, ఎవరైనా కండక్టర్లు టికెట్ డబ్బులు అడిగితే “మా అన్నకు (సీఎం) కు చెప్తాం, నీ ఉద్యోగం తీసేయిస్తాం” అని ధైర్యంగా చెప్పాలంటూ మహిళలకు అండగా నిలిచారు. పారదర్శకమైన పాలనతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సర్పంచ్‌లకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!
