Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారని.. బీజేపీ కి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటని అన్నారు. వర్గీకరణ కోరుకునే వాళ్ళు… బీజేపీ కి ఎలా మద్దతు ఇస్తారో అర్థం కావడం లేదన్నారు.
Read also: AP Elections 2024: చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి… వద్దు అనుకుంటే బీజేపీ కి వేయాలని సూచించారు. ఇదే రెఫరెండం అంటూ రేవంత్ అన్నారు. పదేళ్ళలో ఎన్డీఏ వైఫల్యం ప్రజలకు వివరించే బాధ్యత మాదన్నారు. మోడీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.. కానీ 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు.. ఏం చేశారు ? అని ప్రశ్నించారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను బానిసలు చేసే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో .. మోడీ క్షమాపణ చెప్పారన్నారు. స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకువచ్చి పేదల అకౌంట్ లో వేస్తా అన్నారు. ఒక్కటి ఖాతాలోకి ఇవ్వలేదు మోడీ అని తెలిపారు. సిలిండర్ 1200 కి పెంచాడు, పప్పు ధర పెరిగిందన్నారు.
Read also: T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీ!
భక్తులం అని చెప్పే బీజేపీ..అగరు వత్తుల పై కూడా జీఎస్టీ వేసిందని మండిపడ్డారు. పిల్లలు వాడే పెన్సిల్ మీద కిడా జీఎస్టీ వేశాడు మోడీ అని మండిపడ్డారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు 54 లక్షల కోట్లు చేశారన్నారు. మోడీ ఒక్కడే 113 లక్షల కోట్ల అప్పు చేశాడన్నారు. డబుల్ ఇంజన్ అంటే.. ఆధాని.. ప్రధాని అన్నారు. ఎస్సీ, ఎస్టీ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్న మోడీ.. రిజర్వేషన్లు కూడా తీసేస్తారన్నారు. రాజ్యాంగం పై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందని తెలిపారు. 400 సీట్లు ఉంటేనే అది రద్దు అవుతుందన్నారు. అందుకే బీజేపీ 400 సీట్ల స్లోగన్ తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Dulam Nageswara Rao: ఆశీర్వదించండి.. కైకలూరును మరింత అభివృద్ధి చేస్తా..