Site icon NTV Telugu

CM Revanth Reddy: సాయంత్రం 5 గంటలకు బీజేపీ కుట్రలను బయటపెడతా..

Revanth Reddy Telangana Cm

Revanth Reddy Telangana Cm

CM Revanth Reddy: ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ కుట్రలను బయటపెడతా అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుట్లలో కాంగ్రెస్ జనజాగరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడి ముఖ్యమంత్రిని బెదిరింపులు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఢిల్లీలో హాజరు కావాలని హోమ్ మంత్రి అమిత్ షా హుకుం జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా భయపెట్టి.. బెదిరించి పాలన చేస్తారా మోడీ, అమిత్ షా? అని ప్రశ్నించారు. ఇక్కడ బెదిరించి భయపెట్టిన నిజాం, రజాకర్లును ఇక్కడి ప్రజలు తరిమికొట్టారని తెలిపారు. ఇలాగే చేస్తే మీకు ఒక్క సీట్ కూడా రాదన్నారు. నిజాం, రజాకార్ల కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సాయంత్రం ఐదు గంటలకు బీజేపీ కుట్రలను ప్రెస్మీట్ లో బయటపెడతా అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: CM Revanth Reddy: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై..

తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు. INC తెలంగాణ ట్విట్టర్ ఖాతాతో సీఎంకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. CMO తెలంగాణ, సీఎం తన వ్యక్తిగత ఖాతాలను మాత్రమే ఉపయోగిస్తున్నట్లు లాయర్ సౌమ్య గుప్తా ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు లాయర్ సౌమ్య గుప్తా తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సామాజిక మీడియా వారియర్ గీతా ఫోన్ ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన గీతకి సీఆర్పీసీ 41 ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5 వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.

Read also:

కాంగ్రెస్ లీగల్ సెల్ ఇంఛార్జి రాం చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులకు రిప్లై ఇచ్చామన్నారు. సీఎం స్టార్ క్యాంపైనర్.. ఎన్నికల పనిలో ఉన్నారు కాబట్టి 15 రోజులు సమయం ఇవ్వండి అని ఆడిగామన్నారు. ఢిల్లీ పోలీసు లు ఇచ్చిన లింక్ లను వెరిఫై చేసేందుకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. గీత అనే వారియర్ ని మొబైల్ సీజ్ చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఓ వైపు నోటీసులు ఇచ్చారు.. మరో వైపు అరెస్ట్ లు అంటూ మండిపడ్డారు. ఇదేం పద్దతి.. బెదిరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించడంలో ఢిల్లీ పోలీసులు విఫలం అయ్యారని అన్నారు.
Harish Rao: రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారు.. హరీష్ రావు ఆరోపణ

Exit mobile version