CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు. అనంతరం పార్టీ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించి వరంగల్‌లో భారీ సభకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఎన్నికల సమయంలోనే వరంగల్ అసెంబ్లీలోనే రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం నాడు ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఈరోజు రాహుల్ గాంధీని కలిసి వరంగల్ సభకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.
Read also: Coal Production: ఓపేన్ కాస్ట్ లోకి చేరిన భారీగా వర్షపు నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
రాహుల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ఏఐసీసీ అగ్రనేతలను ఈ సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఆదివారం వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ తర్వాత క్లారిటీ రానుంది. కాగా.. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కేంద్రమంత్రితో చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిన్న రాత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై నేడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో ఇంజినీర్ల స్థాయిలో సమావేశం జరగనుంది.
Chaitanya Reddy : హనుమాన్ మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..