CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- సీఎం ఆదేశాలతో పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ
- రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సి.వి.ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇకపై వీఐపీ కాన్వాయ్‌లు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా నివారించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కేవలం ట్రాఫిక్ విభాగం బాధ్యత మాత్రమే కాదని, శాంతిభద్రతల విభాగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని డీజీపీ ఆదేశించారు. ఐఎస్‌డబ్ల్యూ (ISW), సీఎస్‌డబ్ల్యూ (CSW) విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు ట్రాఫిక్ పరిస్థితిని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉన్నతాధికారులు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!