CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం
- మావోయిస్టు లొంగుబాట్లు, పునరావాసంపై సుదీర్ఘ చర్చ
- “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్‌పై వ్యూహాలు
- కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో భద్రతా బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న “మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్” గురించి కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ భేటీలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , ఐజి సుమతి ఈ సమావేశానికి హాజరై, రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రికి వివరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణలో మావోయిస్టు ముప్పును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. భద్రతా పరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!