వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. రూ. 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి, రూ. 15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆత్మకూరు నుంచి హెలికాప్టర్‌లో మక్తల్ చేరిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందని, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు సీఎం రేవంత్. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదని, సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకులు తాపత్రయపడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి విలువ..
అంతేకాకుండా.. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో పదేళ్లు మన గోడు విన్నవారే లేరు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన రైతులకు రూ.20లక్షల పరిహారం ఇస్తున్నాం. రైతులు అడిగినంత పరిహారం ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. దండు కట్టండి, గుంపు కట్టండి.. దగ్గరుండి పని చేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగిచండి. తండాలు, గూడేలు, మారుమూల పల్లెలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 14 నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నాం. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఆటో సోదరులను రెచ్చగొడుతున్నారు. గతంలో రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటే పశువుల దాణాకు వాడేవారు. ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఆడ బిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ అప్పగించాం. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులు ప్రపంప మార్కెట్‌ను ఆకర్షి్స్తున్నాయి. వర్గీకరణ చేసి మాల మాదిగల మధ్య పంచాయితీని శాశ్వతంగా తెంచేశాం. గత పాలకులు పందులకు, గొర్రెలకు లెక్కలు చెప్పారు కానీ.. కులాల లెక్కలు చెప్పలేదు. అందుకే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు తేల్చాం. ‘ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
