CM Revanth Reddy : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.
CM Chandrababu: “మనమీద నెట్టే రకం”.. మద్యం కుంభకోణంపై స్పందించిన సీఎం చంద్రబాబు..
మున్సిపల్ ప్రాంతాల్లో వర్షపునీటి సమస్యలు తలెత్తకుండా డైవర్షన్ పనులు, డ్రైనేజీ క్లీనింగ్ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ అధికారులు పరస్పర సమన్వయంతో పర్యవేక్షణ చేయాలి అని ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా డిస్కంలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ సిబ్బందిని రోడ్లపై డ్యూటీలకు సిద్దం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
SDRF, NDRF , హైడ్రా బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యవసరంగా పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్లు, కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేయాలని సీఎం ఆదేశించారు. వర్షాలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు వేగంగా చేపట్టాలని ఆయన సూచించారు.
PM Narendra Modi: బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు, దోషులను తృణమూల్ రక్షిస్తోంది..
