CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టులో వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే న్యాయ నిపుణులను సంప్రదించి వ్యూహరచన చేపట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రేపటి ఢిల్లీ పర్యటనలో ఈ భేటీ కీలకమవనుంది.
Smartphone Tips: ఫోన్ స్లో అయ్యిందా?.. కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు.. ఈ పనులు చేస్తే చాలు!
సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం ఎల్లుండి బీహార్‌కు వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొననున్నారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్ ఢిల్లీ పర్యటన, బీహార్ పాదయాత్రలో పాల్గొనడం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ సమావేశాలు, మరోవైపు పార్టీ బలపరిచే ప్రయత్నంలో బీహార్ పాదయాత్రలో సీఎం, మంత్రుల భాగస్వామ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
