CM Revanth Reddy : తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు. ఈ గణన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ వందేళ్లైనా రిజర్వేషన్ల వ్యవస్థను సరిచేయడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతి ఐదు నెలలుగా ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్‌కి సరైన గుర్తింపు రావాల్సిన సమయం ఇదేనని, ఖిలాషాపూర్ కోటను గత ప్రభుత్వం మైనింగ్ కోసం లీజుకు ఇచ్చిందని సీఎం రేవంత్ విమర్శించారు.
V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేస్తున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్నికల విషయానికొస్తే, హార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపించడం పెద్ద కుట్రలో భాగమని, ఈ అంశాన్ని రాహుల్ గాంధీ బహిర్గతం చేశారని అన్నారు. తప్పు చేసిన వారిని వదిలేసి, దాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడగడం అన్యాయం అని తీవ్రంగా విమర్శించారు. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, త్వరలో తాను, ఉప ముఖ్యమంత్రి కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఓట్ల చోరీ చేసే కుట్ర తెలంగాణలో కూడా జరుగుతోందని ఆరోపించిన సీఎం, అలాంటి వారిని అంతా కలిసికట్టుగా ఎదిరించి భరతం పడదామని పిలుపునిచ్చారు.
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్‌కట్
