CM Revanth Reddy : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో జరిగిన కీలక సమావేశం ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ (GHMC) విస్తరణ వంటి ప్రధానాంశాలపై లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 29వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభం అనంతరం కొద్దిపాటి విరామం ఇచ్చి, తిరిగి జనవరి 2వ తేదీ నుండి సమావేశాలను నిరంతరాయంగా కొనసాగించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం చర్చించనుంది.
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
నగర పాలనను మరింత పకడ్బందీగా మార్చే క్రమంలో భాగంగా, జీహెచ్‌ఎంసీలో చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల విలీనంపై మంత్రుల సమావేశంలో చర్చించారు. కొత్తగా ఏర్పడబోయే డివిజన్ల ఏర్పాటు మరియు పరిపాలనాపరమైన మార్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చే ప్రణాళికలో ఇది కీలక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవి పునరావృతం కాకుండా చూడాలని మంత్రులను హెచ్చరించారు. ఈ ఎన్నికల విజయానికి సంబంధించి ఆయా జిల్లాల ఇన్-ఛార్జ్ మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.
Deputy CM Pawan Kalyan: టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ.. హోటళ్లు, ట్రావెల్స్‌పై ప్రత్యేక నిఘా..
