Site icon NTV Telugu

CM Revanth Reddy : ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్.. 15 శాతం కోత

Revanthreddy

Revanthreddy

CM Revanth Reddy : తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లలను పెంచి, చదివించి, జీవితంలో నిలదొక్కుకునేలా చేయడమే కాదు – చివరి దశలో వారికి ఆధారం కావాల్సిన పరిస్థితిలో చాలా మంది పిల్లలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులు బాసటకోసం ఎదురు చూస్తున్న ఈ సమాజంలో, కొందరు వారిని భారంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఈ తరహా ఉదాసీనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి జీతాల్లో నుండి 10-15 శాతం వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనపై ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ నిర్ణయం ప్రజల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది.

Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !

ఇక ట్రాన్స్‌జెండర్ల పరంగా కూడా సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ విభాగంలో మాత్రమే అవకాశాలు కల్పించగా, ఇకపై రవాణా, ఆరోగ్యం, ఐటీ, ఎండోమెంట్, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆదేశాలిచ్చారు.

ఇటీవల హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో జరిగిన ఘటన ఇదే సమస్యను చాటింది. 90 ఏళ్ల వృద్ధురాలు శకుంతలాబాయి చేసిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ అధికారులు, ఆమెను పట్టించుకోని కుమారుల ఇంటిని సీజ్ చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసి, స్పందన లేకపోవడంతో అమలులోకి వెళ్లారు.

ఈ చర్యలు ప్రభుత్వ పరిపాలనలో సామాజిక బాధ్యతకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల హక్కులను కాపాడే దిశగా కీలక ముందడుగుగా అభినందనలు పొందుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, వృద్ధులు మానసిక, ఆర్థిక భద్రతతో జీవించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?

Exit mobile version