Site icon NTV Telugu

KCR: నాగర్ కర్నూలులో నూతన కలెక్టరేట్‌ భవనం.. ప్రారంభించనున్న కేసీఆర్

Kcr

Kcr

KCR: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్‌ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి నాగర్‌ కర్నూల్‌ శివారులోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్‌ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది.

Read also: Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం

సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎస్పీ మనోహర్‌ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీస్, బీఆర్‌ఎస్‌ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం సీఎం కేసీఆర్‌ నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రం శివారులోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌ పక్కన ఉన్నా.. ఖాళీ స్థలంలో సభ నిర్వహణకు ఏర్పాట్లును సభా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.. ఎస్పీ మనోహర్ పరిశీలించారు. సభాప్రాంగణాన్ని చదును చేసే పనులు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. బహిరంగ సభకు సుమారు లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం వస్తుండటంతో జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది.
Terrorist: ఆ రాష్ట్రాలపై నజర్ పెట్టిన ఉగ్రవాదులు..?

Exit mobile version