Telangana CM K Chandra Shekar Rao Wrote Letter to Prime Minister Narendra Modi.
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇండియాకు ఎంతో మంది వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు. ఈ లేఖలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులను, ప్రత్యేక పరిస్థితుల రీత్యా భారతీయ వైద్య విద్యార్థుల విద్యకోర్సు పూర్తయ్యేలా సహాయం చేయాలని ప్రధానిని కోరారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన సుమారు 700 మంది తెలంగాణ వైద్య విద్యార్థుల ఫీజును రాష్ట్ర ప్రభుత్వమా భరిస్తుందని ఆయన వెల్లడించారు. దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్సార్ధులకు ప్రవేశం కల్పించాలని ఆయన విన్నవించారు. సానుభూతి తో వైద్య విద్యార్థుల స్థితిని పరిశీలించి ఆదుకోవాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
