Site icon NTV Telugu

KCR: కేంద్రంపై మరో పోరు.. ఢిల్లీకి కేసీఆర్‌ బృందం

కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్‌ పార్టీ.. టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Read Also: Sarpanch: ముగ్గురికి వేధింపులు.. యువతి ముక్కు కోసిన సర్పంచ్‌

వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం 4వేల 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వానకాలం ధాన్యాన్ని ఇప్పటికే సేకరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పడంతో ఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో TRS గతంలో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శిస్తోంది టీఆర్‌ఎస్‌. రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది. ఇక, టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు . కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ధాన్యం కొనుగోలుపై తేల్చుకుంటామని చెబుతున్నారు. మరో నెలన్నరలో యాసంగి పంట చేతికొస్తుంది. దీంతో ధాన్యం కొనుగోళ్లనే ప్రధానాస్త్రంగా చేసుకోవాలని ఎత్తుగడ వేశారు టీఆర్‌ఎస్‌ చీఫ్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలనేది కేసీఆర్‌ ప్లాన్‌గా కనిపిస్తోంది.

Exit mobile version