Site icon NTV Telugu

CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్

Cm Kcr

Cm Kcr

CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. నేడు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, సిద్దిపేట జిల్లాలోని వేములవాడ, దుబ్బాకలో పర్యటించనున్నారు.

Read also: RBI: వ్యక్తిగత రుణాలపై కఠిన నిబంధనలు.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..

ముందుగా ఖానాపూర్‌లో నిర్వహించే జన్‌ ఆశీర్వాద సభకు బీఆర్‌ఎస్‌ అధినేత హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం జగిత్యాలకు చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన జన్‌మంగల్‌ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం ఆయన వేములవాడకు బయలుదేరి వెళతారు. 3 గంటలకు వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో జరిగే జన ఆశీర్వాద సభలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. చివరగా సాయంత్రం 4 గంటలకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే జన్ ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.
Bollywood: ‘A’ సర్టిఫికేట్ తో అత్యధిక కలెక్టన్స్‌ రాబట్టిన సినిమాలు ఇవే…

Exit mobile version