CM KCR: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలో జరిగి భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారితో సహా 9మంది మృతిచెందారు. దీంతో నాంపల్లి ప్రమాద ఘటన వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. నాంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించడానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
ఈ ప్రమాదంలో జాకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా, మహ్మద్ ఆజం (53), తూభా (5), రెహమాన్ రెహనా సుల్తానా (50), తరుబా (12), డాక్టర్ ఫర్హీన్ (36), ఫైజా సమీన్ (25). డా. సెలవుల కారణంగా ఫర్హీన్ తన పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమాచారం రాబట్టారు. ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. సోమవారం సాయంత్రంలోగా ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాంటి గోదాముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
Revanth Reddy: వరుస అగ్ని ప్రమాదాలు.. చర్యలు చేపట్టడంలో సర్కార్ విఫలం