Revanth Reddy: వరుస అగ్ని ప్రమాదాలు.. చర్యలు చేపట్టడంలో సర్కార్ విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నాంపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ రోజు ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ సెల్లర్ లో కారు మరమ్మతులు ఏంటి? అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి రేవంత్ రెడ్డి కోరారు.
నాంపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఓ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. వీరిలో కొందరు ఊపిరాడక చనిపోగా, మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు కూడా మంటల్లో చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ముందు పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న 15 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక కొంత మంది అపస్మారక స్థితికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజ్ ఉందని, ఆ గ్యారేజీలో కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని స్థానిక డీసీపీ తెలిపారు. గ్యారేజీలో డీజిల్, రసాయనాల డ్రమ్ములు ఉన్నాయని, వాటికి మంటలు అంటుకున్నాయని, మంటలు అపార్ట్‌మెంట్ పై అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. అపార్ట్‌మెంట్‌లోని మూడు, నాలుగో అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి.
Deepti Sati: కాటుక కన్నుల అందాలతో కైపుఎక్కిస్తున్న..దీప్తి సతి
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!