Site icon NTV Telugu

కేసీఆర్ దసరా శుభాకాంక్షలు.. రేవంత్‌, సంజయ్‌, కిషన్‌రెడ్డి విషెస్..

రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్‌..

మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి ఆకాంక్షించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అత్యంత పవిత్రమైన పండుగ, గ్రామాలలో వైభవంగా నిర్వహించుకునే దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో తరతమ భేదం లేకుండా అంత కలిసి జరుపుకునే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పండుగ దసరా అని, ప్రజలు ఆనందంగా, సుఖ శాంతులతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు రేవంత్‌రెడ్డి..

ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.. హిందూ బంధువులకు దసరా(విజయ దశమి) పండుగ శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్.. చెడు ఎంత బలమైనదైనా, ఎంతటి దుర్మార్గమైనదైనా చివరికి మంచే విజయం సాధిస్తుందని ఈ విజయ దశమి సూచిస్తుందని పేర్కొన్నారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 100 లక్షల కోట్లతో ప్రధాని గతిశక్తి అభివృద్ధి ప్రణాళికలకు రూపొందించిన ప్రణాళికలు మోడీ లక్ష్యం ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా, శక్తివంతమైన దేశంగా రూపొందాలన్న ఆకాంక్ష సంపూర్ణం కావాలని ఈ విజయదశమి విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు.. మరోవైపు.. దేశ ప్రజలకు దసరా(విజయ దశమి) శుభాకాంక్షలు తెలిపారు కిషన్‌రెడ్డి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించడానికి దేశ ప్రజల సహకారం ,భాగస్వామ్యం లభించడం, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉండడం గొప్ప విజయంగా అన్నారు.. శక్తి స్వరూపిణి దయతో దేశ ప్రజలు ఈ విజయదశమిని ఆనందోత్సహాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

Exit mobile version