కేసీఆర్ వ్యూహం మారింది.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పుడు అందరి నోట దళితుల మాటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత కోసం ఓ ఉద్యమాన్నే బుజాలకు ఎత్తుకున్నారు.. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.. దీనిని కేవలం ఒక ప్రాంతానికి ఏ ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.. దళితులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని.. అన్ని అంశాల్లోనూ వారికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకుంటామంటూ.. హుజూరాబాద్ వేదికగా జరిగిన సభలో ప్రకటించారు సీఎం కేసీఆర్.. సీఎంవోలో దళిత అధికారులు లేరన్న విమర్శలకు కూడా అక్కడి నుంచే చెక్ పెట్టేశారు.. ఏదేమైనా.. దళితుల ఓట్లను గంపగుత్తగా గులాబీ పార్టీకి పడేలా.. గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది.. ఇక, రాజకీయంగా ఆ వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.. త్వరలోనే మంత్రివర్గంలోకి దళితులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. దీంతో.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
మరోవైపు.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక ఖాళీ ఏర్పడింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కొందరిని తప్పించి.. మరికొందరు కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉందంటున్నారు. అలా కొందరిని తప్పించి వారి స్థానంలో దళిత వర్గానికి చెందిన నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్‌గా ఉందనే ప్రచారం సాగుతోంది.. ప్రస్తుతం కేబినెట్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ లేరు. మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఈ వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కేబినెట్‌తో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా మారిన రాజకీయ పరిస్థితులు.. దళితుల పెరిగిన ప్రాధాన్యతత.. కేబినెట్‌లోనూ దళిత ప్రజాతినిధులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!