Site icon NTV Telugu

CM KCR Delhi Visit: బీఆర్‌ఎస్‌ ప్రకటన తర్వాత తొలిసారి హస్తినకు కేసీఆర్.. ఏం జరగబోతోంది..?

Kcr

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి హస్తినబాట పట్టారు.. అయితే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్‌.. బీఆర్ఎస్‌ పార్టీని ప్రకటించారు.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఆయన ఢిల్లీలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడంతో.. ఆయన పర్యటన ఎలా సాగనుంది..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. అంతకుముందు.. ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లారు కేసీఆర్.. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు వెళ్లిన ఆయన.. ములాయం పార్థివ దేహానికి నివాళులర్పించారు… అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.. ఆ తర్వాత నేరుగా హస్తినకు చేరుకున్నారు.. కేసీఆర్‌ వెంట.. ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్‌​ కుమార్ తదితర నేతలు ఉన్నారు..

Read Also: High Court: రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ కేసు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

అయితే, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికార నివాసంలో బస చేస్తున్నారు.. ఈ వారాంతం వరకు హస్తినలోనే కేసీఆర్ మకాం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ సమయంలో కేసీఆర్‌ ఎవ్వరెవ్వరిని కలుస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఈ తొలి పర్యటనలో.. మేధావులు, మాజీ ఐఏఎస్‌ అధికారులు, ఆర్థికవేత్తలతో సమావేశాలు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత.. కేసీఆర్‌కు చాలా మంది మద్దతు పలికారు.. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో ఇప్పటికే చర్చలు జరుపుతూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు కూడా మరోసారి కలవబోతున్నారని తెలుస్తోంది.. ఇక, రైతుసంఘం నేతలు టికాయత్‌ లాంటి నేతలు కూడా కేసీఆర్‌ను కలవబోతున్నారట.. బీఆర్ఎస్‌ ప్రకటనకు ముందే.. హైదరాబాద్‌లో రైతు సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశయ్యారు కేసీఆర్.. వారంతా కొత్తగా ప్రకటించిన జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.. మరోవైపు.. నార్త్‌ ఇండియాలోని ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు కూడా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉంది.. గతంలోనే వీరితో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపిన ఆయన.. ఇప్పుడు మరోసారి కీలక మంతనాలు జరపబోతున్నారట.. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఢిల్లీ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.. ఈ పర్యటనలో కేసీఆర్‌.. బీఆర్ఎస్‌ ఆఫీసును ప్రారంభించే అవకాశం కూడా ఉందంటున్నారు..

ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్‌తో.. మరోసారి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. ఇతర నేతలు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌.. నార్త్‌లోని మరికొన్ని పార్టీల నేతలు కూడా భేటీ అవుతారని తెలుస్తుంది.. కాగా, టీఆర్ఎస్‌ పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తూ పార్టీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.. సీనియర్‌ నేత వినోద్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆ తీర్మానాన్ని అందజేసింది.. అయితే, టీఆర్ఎస్‌ పార్టీ పేరునూ.. బీఆర్‌ఎస్‌గా మార్చిన తీర్మానానికి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది.. ఇక, ఢిల్లీలో అడుగుపెట్టగానే మొదట తన అధికారికి నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆ తర్వాత సుభాష్‌ చంద్రబోస్‌ రోడ్డులో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న బీఆర్‌ఎస్‌ ఆఫీసును పరిశీలించారు.. ఓవైపు ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణం కొనసాగుతుండగా.. అప్పటి వరకు ఓ కార్యాలయం అవసరం కాబట్టి.. సుభాష్‌ చంద్రోబస్‌ రోడ్డులోని ఓ ట్రస్ట్‌కు సంబంధించిన ఆఫీసును లీజ్‌కు తీసుకున్నారు.. ఇప్పటికే మరమ్మతులు కూడా జరుగుతున్నాయి.. ఇవాళ కొందరు అధికారులు… పార్టీ నేతలతో కలిసి.. ఆ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించారు కేసీఆర్.

Exit mobile version