Site icon NTV Telugu

CM KCR: దుష్టశక్తుల్ని తరిమికొట్టాలి.. వికారాబాద్ సభలో కేసీఆర్ నిప్పులు

Kcr Vkb

Kcr Vkb

ఇవాళ వికారాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వికారాబాద్ కు మెడికల్, డిగ్రీ కాలేజీల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయన్నారు.. కర్నాటక కంటే తెలంగాణలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భూముల ధరలు పెరిగాయి… 8 ఏళ్ళలో బీజేపీ ప్రభుత్వం ఏ మంచిపనైనా చేసిందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కరెంట్ మీటర్లు పెట్టి రైతులనుంచి బిల్లులు వసూలు చేయాలా? బీజేపీ జెండాల్ని నమ్మితే ఏం ప్రమాదం జరుగుతుందో ఆలోచించండి… ఉచిత కరెంట్ కావాలంటే జాగ్రత్తగా వుండాలన్నారు. వికారాబాద్ జిల్లాలో నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. వికారాబాద్ కు ఎంతో చరిత్ర వుందన్నారు కేసీఆర్.

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడో ,ఇంకో దద్దమ్మ నో కేంద్రం ను అడగాలి…కృష్ణ నీటి వాటా తేల్చమని.కేసీఆర్ బస్సుకు అడ్డంగా జెండాలు పట్టుకొని వచ్చుడు కాదు ? మోడీని అడగడానికి బిజెపి వాళ్లకు ప్యాంట్లు తడుస్తాయి. నేడు పీఎం మోడీ శత్రువు అయ్యాడు. పాలమూరు రంగారెడ్డి నుంచి వికారాబాద్ కు నీళ్లు రాకపోవడంకు కేంద్రం వైఖరి కారణం. కేంద్రం కృష్ణ నీటి వాటా తేల్చడం లేదు. మోడీ ప్రసంగంలో ఏమీ లేదు. దేశానికి మోడీ వల్ల ఏం జరిగిందో ఆలోచించండి. ఇంటికి వెళ్లి మీరు ఆలోచిస్తే విషయం తెలుస్తుందన్నారు. నెత్తికో రుమాలు కట్టి ఒక వేషం…ఏమి ఉపయోగం? కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించే ఉత్తమ మైన సర్కార్ రావాలి. దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో పెన్షన్లు ఎంత ఇస్తున్నామో చూడండి. పక్కనున్న కర్నాటకకు వెళ్లి చూసి రండి అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశాం. కరెంటు బాధలు పోయాయి. గతంలో కరెంటు ఎప్పుడొస్తదో? ఎప్పుడు రాదో? ఎన్ని మోటార్లు కాల్తయో? ఏసిన పంట పండుతదో లేదో తెల్వదు.

వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలూ అత్యుత్తమ విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సంక్షేమం చేసుకుంటున్నం. దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నాం. ఆడపిల్లల పెళ్లికి కులమతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నాం. ఆస్పత్రులలో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కేసీఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసు. ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడయినా వున్నాయా?

గతంలో ఉన్న నీటి బకాయిలు కూడా రద్దు చేశాం. గతంలో ప్రమాదాల్లో రైతులు చనిపోతే ఆపద్భంధు అని చెప్పి రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. అది కూడా ఆరేడు నెలలపాటు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగితే.. ఏ పదివేలో ఇచ్చి మేసేవాళ్లు మేసి మిగతావి రైతులకు ఇచ్చేవారు. పల్లె సీమలు పచ్చదనంతో కళకళలాడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, పల్లెల్లో ఉన్న వారందరికీ పనులు దొరకాలనే ఆలోచనతో ప్రభుత్వం నేడు ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుబీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా.. నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయన్నారు సీఎం కేసీఆర్.

Read Also: A.R. Rehman: ఆస్కార్ అవార్డు విన్నర్ 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూడండి

Exit mobile version