Bhatti Vikramarka: రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో.. మంత్రులు ఇళ్లల్లో ఉంటే.. అధికారులకు ఆదేశాలు ఇచ్చే వారే లేరని ఆయన విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?
గోదావరి వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రైతులు 70 శాతం వ్యవసాయ పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా నష్టపోయారని.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలతో పాటు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని భట్టి డిమాండ్ చేశారు. వరద బాధితులకు ఇస్తానన్న పదివేల రూపాయలు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
