Site icon NTV Telugu

Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లు.. తలసానికి భట్టి సవాల్

Bhatti, Talasani

Bhatti, Talasani

Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి చూడు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తలసాని కామెంట్స్ పై ఫైర్‌ అయ్యారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములే పేదల దగ్గర ఉన్నాయని తెలిపారు. తలసాని ఇచ్చిన భూములు ఎన్ని? నువ్వు చేసిన అభివృద్ధి ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పులు తేవడం.. మద్యం అమ్మకాలు పెంచడమే కదా మీరు చేసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని.. ప్రియాంక గురించి మాట్లాడే వ్యక్తా? అంటూ మండిపడ్డారు. అత్మహత్యలకు పురిగొల్పింది టీఆర్‌ఎస్‌ యే. ఒకసారి యూనివర్సిటీకి వెళ్లి బయటకు రా? అంటూ సవాల్‌ విసిరారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా.. కాకతీయ యూనివర్సిటీ వెళ్లి రా.. అంటూ గట్టి సవాల్‌ విసిరారు. అప్పుడు తెలుస్తుంది నిరుద్యోగుల బాధ ఏంటో అని మండిపడ్డారు. వంద మంది సెక్యూరిటీ పెట్టుకుని మాట్లాడటం కాదని ఎద్దేవ చేశారు. జనం దగ్గరికి వచ్చి మాట్లాడు అంటూ భట్టి, తలసానికి సవాల్‌ విసిరారు.

Read also: Metro Free Service: మెట్రో ప్రయాణికులకు శుభవార్త ! మీరు ఈ కోవకు చెందితే ఫ్రీగా తిరగొచ్చు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని ఇప్పుడు ఒక్కసారిగా మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పిస్తున్న పలువురు నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఏమాత్రం ఎవరిని వదలకుండా మాటలతో తీసిపడేశారు. బీజేపీ నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గతంలో ఎన్నడూ లేనంతగా శివాలెత్తి పోయారు. కాగా.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. పలువురు నేతలు తలసానిని వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తూ.. మండిపడ్డారు.
Telangana Temple: కవిత కొండగట్టుకు.. ఇంద్రకరణ్ రెడ్డి భద్రాదికి..

Exit mobile version