Site icon NTV Telugu

CI illegal Affair: కారులో సీఐ రాసలీలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

Vanastali Puram Ci Raju Aresst

Vanastali Puram Ci Raju Aresst

CI Raju Attested For illegal Affair: ఇటీవల మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరవక ముందే మరో ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ఇన్‌స్పెక్టర్‌ గా పని చేస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. సీఐ రాజు అక్రమ సంబంధం పెట్టుకున్న యువతితో కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో సీఐని పోలీసులు పట్టుకున్నారు…అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులపై సీఐ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో సీఐను అరెస్ట్‌ చేశారు అయితే.. హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఎస్‌బీ విభాగంలో సీఐగా రాజు పనిచేస్తున్నారు. నగరంలోని వనస్థలిపురంలో మహిళతో కారులో ఏకాంతంగా.. మద్యం మత్తులో ఉన్న రాజు తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు.

Read also:Hello Meera: పెళ్ళికి ముందు ప్రేమతో ఇబ్బందుల్లో మీరా…

ఈనేపథ్యంలో.. అక్రమ సంబంధ పెట్టుకున్న మహిళతో పాటు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుల్స్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో..ఈ మేరకు సీఐ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. తాజాగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో.. వనస్థలిపురం లాడ్జిలో వేరే మహిళతో ఉండగా మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు… ఆయనవద్ద వున్న తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె.. భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. సీఐ నాగేశ్వరరావుపై కేసుల్లో విచారణ ఎదుర్కొంటుండగా, అతనిని సర్వీసుల నుంచి ప్రభుత్వం పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే.

Exit mobile version