Site icon NTV Telugu

Chutneys : ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు.. పరుగులు తీసిన కస్టమర్స్‌..

Chutneys

Chutneys

Chutneys : హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చట్నీస్‌’ (Chutneys)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఎల్బీనగర్‌లోని ఆర్ఆర్ జిల్లా కోర్టు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో జరిగిన ప్రమాదంతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో రెస్టారెంట్ కిచెన్‌లో వంట పనులు జరుగుతుండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇడ్లీ స్టీమర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి కిచెన్‌లోని పరికరాలు చిందరవందరగా పడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో హోటల్‌లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 468KM రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే

స్థానికులు సైతం బాంబు పేలుడు సంభవించిందేమోనని భీతిల్లారు. ఈ ప్రమాద సమయంలో కిచెన్‌లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన ఎన్టీఆర్ నగర్‌లోని ఆద్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోందని, ప్రమాదం నుండి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?

Exit mobile version