ఎవరికైనా సమస్యలు, కష్టాలు బాధలు ఉంటే ఎంతటివారైనా, సామన్య ప్రజలు అయినా గుడికి, మసీదులకు. చర్చిలకు వెలుతుంటారు. భక్తుల సమస్యలు పరిష్కారం కావాలని పూజారులు, మత భోదకులు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే..అంతటి పవిత్రమైన స్థానంలో ఉండి ఆ స్థానానికే మాయని మచ్చ తెస్తున్నాడో ప్రబుద్ధుడు. ఎంతో ఆర్తితో వచ్చి చర్చిలో తమ గోడు వెల్లబోసుకునే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ.. ఓ పాస్టర్ పాడుపనులకు పాల్పడుతున్నాడు. ఈ పాస్టర్ చేసే పనులకు విసుచెందిన తోటి పాస్టర్లు సంఘం పెద్దలకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో పాస్టర్ రాసలీలల వ్యవహారం కలకలం రేపుతోంది.
Also Read : Tollywood Heroes: థ్రెడ్స్ ను కూడా వదలని టాలీవుడ్ హీరోలు.. ఎన్టీఆర్ తో సహా ఎవరెవరు జాయిన్ అయ్యారంటే.. ?
బొల్లారంలోని చర్చి పాస్టర్ జయరాజ్ చర్చికి వచ్చిన అమ్మాయిలను లొంగదీసుకుంటున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తోటి పాస్టర్లు. గతంలో పాస్టర్ జయరాజ్ ఐదారుగురు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తూ దొరికాడని మరో పాస్టర్ చెబుతున్నాడు. దీంతో.. సంఘం పెద్దల దృష్టికి విషయం తీసుకెళ్తే మత పెద్దలు హెచ్చరించారని, అయినా మార్పురాకుండా పాస్టర్ జయరాజ్ ఇలానే ప్రవరిస్తున్నాడని పాస్టర్లు ఆరోపిస్తున్నారు. ఎంతో పవిత్రమైన స్థానంలో ఉండి అపవిత్రంగా వ్యవహరిస్తున్నారని పాస్టర్ జయరాజ్ పై తోటి పాస్టర్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా.. చర్చికి భార్య, పిల్లలతో రావాలంటే భయమేస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. జయరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్థులు.
Also Read : Revanth Reddy: అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ తీసేస్తామంటే ఏడుస్తున్నారు..