Site icon NTV Telugu

Churidar Gang: నగరంలో చుడీదార్‌ గ్యాంగ్‌ హల్ చల్.. వీడియో వైరల్..

Chudridar Gand

Chudridar Gand

Churidar Gang: ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ దోపిడీల గురించి విన్నాం, చూశాం. కానీ, తెరపైకి ఇప్పుడు మరో గ్యాంగ్ వచ్చింది అదే చూడీదార్ గ్యాంగ్. చుడీదార్ ధరించి, ముఖానికి పూర్తిగా బట్టతో కప్పి ఉంచి పురుషులు, మహిళలు చోరీలకు పాల్పడుతున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒకరు బురఖాను ధరించి నట్లు కనిపిస్తున్నా, మరొకరు చుడీదార్ ధరించి యదేచ్ఛగా చోరీ చేస్తున్న ఘటన నగరంలో భయభ్రాంతులకు గురిచేస్తుంది.

Read also: MS Dhoni-Virat Kohli: విరాట్.. ఈసారి కప్ గెలవాలి: ధోనీ

తాజాగా చుడీదార్ గ్యాంగ్ ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కె.వెంకటేశ్వరరావు అనే ప్రైవేట్ ఉద్యోగి.. ఎస్.ఆర్. నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెక్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 18న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి తాళం పగులగొట్టి ఉండడం గమనించి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించింది. దీంతో షాక్ కి గురైన వెంకటేశ్వరరావు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు. అయితే సీసీటీవీని చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. అందులో ఇద్దరు చుడీదార్ సీసీటీవీ, ముఖం కనిపించకుండా స్కాఫ్ కట్టుకుని లోనికి వస్తున్న వీడియో రికార్డుఅయ్యాయి. మెట్లెక్కి ఇంట్లోకి చొరబడి నాలుగు తులాల బంగారంతో పాటు రూ. లక్ష నగదు, ల్యాప్‌టాప్ చోరీ చేసి అక్కడి నుంచి వెళుతున్నట్లు వీడియోలో రికాడ్డు కావడంతో పోలీసులు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Sambit Patra: “నోరుజారి” పశ్చాత్తాపం కోసం “ఉపవాసం” చేపట్టిన బీజేపీ నేత

చుడీదార్‌ గ్యాంగ్‌కు, చెడ్డీ గ్యాంగ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పుడు హాలీడేస్ లో అందరూ ఇళ్లనుంచి టూర్ లకు వెళుతున్నారని ఇదే సమయంగా భావించి దొంగలు తెగబడుతున్నారని తెలిపారు. ప్రజలు ఊరికి వెళ్లేప్పుడు పక్కింటి వారికైనా, పోలీసులకైనా సమాచారం ఇవ్వాలని, ఇంట్లో డబ్బులు, నగలు పెట్టకూడదని సూచించారు. నగర ప్రజలు చుడీదార్ గ్యాంగ్ తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అదుపులో తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్ ఆర్ నగర్ లో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడిన ఘటన ఇప్పుడు నగరం మొత్తం చర్చనీయాంశమైంది. మహిళల వేషధారణలో చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళల దుస్తులు ధరించడం వల్ల దొంగతనాలు చేయడం సులువు అవుతుందని, అపార్ట్‌మెంట్‌లోకి సులువుగా ప్రవేశించే అవకాశం ఉందని, ఎవరికీ అనుమానం రాకుండా కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.


Madhuri Dixit: ఖరీదైన కారును కొన్న బాలీవుడ్ బ్యూటీ.. ధర వింటే మైండ్ బ్లాకే…
Exit mobile version