Virat Kohli Meets MS Dhoni after RCB vs CSK Match: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. టాస్ నుంచే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఫినిషర్ ఎంఎస్ ధోనీని పెవిలియన్ చేర్చి.. అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సీఎస్‌కేతో సమానంగా 14 పాయింట్లు ఉన్నా.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లకు సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మైదానాన్ని వీడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆర్‌సీబీ ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో ఉండగా కాసేపు ఎదురుచూసిన ధోనీ.. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడుతుండగా కలిసిన ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోనీ.. నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Also Read: MS Dhoni Retirement: ఆ తర్వాతే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్!
అయితే సెలెబ్రేషన్స్ అనంతరం ఎంఎస్ ధోనీని వెతుక్కుంటూ.. విరాట్ కోహ్లీ సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ధోనీకి విరాట్ షేక్ హ్యాండ్ ఇచ్చి.. కాసేపు ముచ్చటించాడని సమాచారం. ఈ సందర్భంగా కోహ్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ధోనీ.. ఫైనల్‌లో ఆర్‌సీబీ తప్పక విజయం సాధించాలని చెప్పాడట. ‘నువ్వు ఫైనల్‌కు చేరాలి. ఫైనల్ పోరులో విజయం సాధించాలి’ అని కోహ్లీతో ధోనీ అన్నాడట. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.