ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్.. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.. ఈ సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మా కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తున్నారని తెలిపారు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేశామని.. 600 సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు.. మత్స్య కార్మికులకు ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్నామని వెల్లడించిన ఆయన.. 26 వార్డుల్లో 260.1 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు.. 303 కోట్ల రూపాయలతో నిర్మించిన 505 ఇళ్లు వారం రోజుల్లో అర్హులకు అందిస్తామని ప్రకటించారు.
Read Also: Bomb Threat: చార్మినార్‌కు బాంబు బెదిరింపు.. పాతబస్తీలో కలకలం
ఇక, బీసీలను అగౌరవ పరిచే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు ఉంటున్నాయని మండిపడ్డారు వినయ్ భాస్కర్.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత దేశ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారన్న ఆయన.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. బీసీలను చైతన్యపరచడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.. ఇదే సమయంలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులకు భయపడమని హెచ్చిరించారు.. కేంద్ర ప్రభుత్వం కుట్రలు ప్రజల ముందు పెడతామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. కాగా, తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.. మునుగోడులో గెలుపు.. టీఆర్ఎస్‌లో కొత్త జోష్‌ని నింపింది..