NTV Telugu Site icon

Chevella MP Ranjith Reddy: నిర్మలా సీతా రామన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తాం

Chevella Mp Ranjith Reddy

Chevella Mp Ranjith Reddy

Chevella MP Ranjith Reddy will depose Nirmala Sita Raman as a parliamentary witness: కేంద్ర మంత్రి నిర్మల సీతారమన్ పై చేవెళ్ళ ఎం.పి రంజీత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయుష్ మాన్ భారత్ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణ లో కేంద్ర మంత్రులు సైతం నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతా రామన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తామని స్పష్టం చేశారు.

సభలో వివిధ అంశాలపై వారి ఇస్తున్న జవాబులకు వారు ప్రవర్తిస్తున్న తీరు ఏలా ఉందో ప్రజలు గ్రహిస్తారని అన్నారు. సీతా రామన్ తప్పుగా మాట్లాడారు! కాబట్టే మీడియా ముందుకు రాలేదని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా చాలా సార్లు కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంతని ప్రశ్నించినా మంత్రులు దాట వేశారని అన్నారు. 3500 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్న కేంద్రం.. దానికి సంబంధించిన సాక్షాలు చూపించాలని రంజీత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు పారేసుకుంటున్న బీజేపీ నాయకులకు పార్లమెంట్ లోనే జవాబు చెబుతామని అన్నారు.
Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్‌ మాత్రమే ఓటు వేయండి

Show comments