కోడలిని అత్తారింట్లో కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ బరితెగించాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. దీంతో విసుగుచెందిన కోడలు మామకి బాగా బుద్ధి చెప్పింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది. కోడలిని లైంగికంగా వేధిస్తున్న మామ రాములు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కోడలు చంద్రకళ మామ దాష్టీకాన్ని నిలదీసింది. అపరకాళిలా మారింది. మామను చితకబాదింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడా మామ.
గాయపడిన మామను ఆసుపత్రికి తరలిస్తుండగా మామ మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం కలిగించింది. అంతేకాదు ప్రతిరోజూ మామ లైంగిక వేధింపులను సెల్ ఫోన్ లో చిత్రీకరించిందా కోడలు. అయితే, ఈ ఘటనపై బంధువులు చెప్పేది భిన్నంగా వుంది. కేవలం ఆస్తి కోసమే మామను కోడలు చంపిందంటున్నారు బంధువులు. దీంతో చంద్రకళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రకళ చేసింది ఏమిటి? మామ లైంగిక వేధింపులు భరించలేక ఇలా చేసిందా? అసలు జరిగిందేంటి? పోలీసుల విచారణలో అన్ని విషయాలు తేలనున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.
Megha Akash: గోవాలో గుమ్మడి కాయ కొట్టేసిన చిన్నది!
క్యాట్ ఫిష్ రవాణా చేస్తుండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్యాట్ ఫిష్ ల రవాణా కలకలం రేపింది. నిషేధిత క్యాట్ ఫిష్ సుమారు 1500 వందల కేజీలు వ్యాన్ లో ఏలూరు నుండి భద్రాచలం కు తరలిస్తుండగా అన్నపురెడ్డిపల్లి లో పట్టుకున్నారు పోలీసులు. వాహనం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.
