Chennamaneni Ramesh Babu : వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఓటు హక్కు ఇక ఇకలేనిది. రాష్ట్ర హైకోర్టు జర్మనీ పౌరుడని తేల్చిన తీర్పు ఆధారంగా, అధికారులు ఆయన్ను ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ అధికారికంగా ప్రకటించారు. వేములవాడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి & ఆర్డీవో రాధాబాయి, జూన్ 24న ఫారం-7 ద్వారా నోటీసు జారీ చేస్తూ ఏడురోజుల గడువు ఇచ్చారు. గడువు ముగిసిన నేపథ్యంలో, జూలై 3న వేములవాడ నియోజకవర్గంలోని బూత్ నెం.176 ఓటర్ జాబితా నుంచి రమేష్ బాబు పేరు తొలగించినట్లు తెలిపారు.
Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..
అదేవిధంగా ఆయన నివాసమైన రెండవ బైపాస్ రోడ్డులో నోటీసును అతికించారు. ఈ చర్యలు రాష్ట్ర హైకోర్టు తీర్పు మరియు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివాదానికి వేరుకు కారణం 2009లోనే ఉంది. అప్పట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ – చెన్నమనేని రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదని, నకిలీ పత్రాలతో ఓటర్‌గా నమోదై ఎమ్మెల్యేగా నిలిచారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం, 2013లో హైకోర్టు రమేష్ బాబు భారతీయ పౌరుడే కాదని, జర్మనీ పౌరుడు అనే తీర్పును వెల్లడించింది.
డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు తండ్రి చెన్నమనేని రాజేశ్వర్ రావు స్ఫూర్తితో 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడే టిడిపి అభ్యర్థిగా వేములవాడ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను ఓడించారు. ఆపై 2010 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. తండ్రి లాగా ఆయన్ను వేములవాడ ప్రజలు ఆదరించారు. తాజాగా ఆయన ఓటు హక్కు పోవడం రాజకీయంగా తీవ్ర దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు.
Minister Kollu Ravindra: ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ఈరోజు నీతులు చెబుతున్నారు!