TS School Timing: స్కూల్ టైమింగ్స్‌లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School Timing: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్‌లో అయితే పాఠశాలలు కొంత సమయం ముందుగానే ప్రారంభమవుతాయి. అయితే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు, పొద్దున్నే నిద్రలేవరని ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు తెరవాలని పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద పిల్లలు హైస్కూళ్లలో చదువుతున్నందున ఉదయం 9గంటలకే పాఠశాలను ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం స్కూల్ టైమింగ్స్ విరుద్ధంగా ఉన్నాయని.. అందుకే వాటిని మార్చాలని కోరుతున్నారు. అన్ని పాఠశాలలు ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని వారు సూచిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు వేళల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు తర్వాత పాఠశాల సమయాల్లో మార్పులు ఉండవచ్చు.
Read also: బ్యూటీ విత్ బ్రెయిన్.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
మరోవైపు పాఠశాలల సమయాలను మార్చే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులతో చర్చించడంతోపాటు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే చిన్న పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు ఉదయం 9 గంటలకు ముందే వెళతారని చెబుతున్నారు. పాఠశాలలు ఆలస్యంగా తెరిస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు పాఠాలు బాగా అర్థమవుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హైస్కూల్‌కు పక్క గ్రామాల నుంచి చాలా మంది పిల్లలు వస్తున్నారని, అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తున్నారని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు గ్రామంలోనే ఉండడంతో ఆలస్యంగా తెరవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల సమయపాలనకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!