NTV Telugu Site icon

CEC on Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ.. ఆధారాలు లేవు..!

Cec

Cec

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కాకరేపుతోంది.. వివమర్శలు, ఆరోపణలు.. ఫిర్యాదులే కాదు.. దాడుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఓట‌ర్లకు న‌గ‌దు పంపిణీ చేసేందుకు కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ప‌లువురు వ్యక్తులు, సంస్థల‌కు న‌గ‌దు బ‌దిలీ చేశారంటూ టీఆర్ఎస్‌ ఫిర్యాదు చేసింది.. ఇక, దీనిపై స్పందించిన ఈసీ.. రూ.5.24 కోట్ల న‌గ‌దు లావాదేవీల‌పై సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల లోపు స‌మాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. స‌మాధానం ఇవ్వకుంటే త‌గు నిర్ణయం తీసుకుంటామ‌ని హెచ్చరించింది.. అయితే, ఈసీ నోటీసులకు సమాధానం ఇచ్చారు కోమటిరెడ్డి.. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది.. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది ఎన్నికల కమిషన్… ఇదే సమయంలో.. మునుగోడు ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

Read Also: High Court on Amaravati Farmers Padayatra: రైతుల పిటిషన్‌, డీజీపీ అదనపు పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు..