NTV Telugu Site icon

Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి.. రేవంత్ ట్విట్

Revanthreddy Somesh Kumar

Revanthreddy Somesh Kumar

Revanth Reddy: సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ట్వీట్టర్‌ ద్వారా ఆయన డిమాండ్‌ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. అయితే.. ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి.. వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని అన్నారు. దీంతో.. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేశ్ కు తాకిందని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు.

Read also: Cashews Benefits: ఇవి రోజూ తింటే.. పురుషుల్లో ఆ సమస్యలు దూరం

తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్‌కు పంపాల్సిందేనని హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించిన విసయం తెలిసిందే.. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వాదనలు వినిపించారు. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేశారు. అయితే.. తెలంగాణ హైకోర్టులో సీఎస్ సోమేశ్ కుమార్ కు చుక్కెదురైంది. డీఓపీటీ పిటిషన్ పై హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీకు వెళ్లిపోవాలని హై కోర్టు ఆదేశించింది. సోమేశ్ కుమార్ కౌన్సిల్ సమయం కోరింది. సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అప్పీల్ కు సమయం కోరింది. సమయం ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు నిర్ణయంతో సోమేశ్‌ కుమారు ఏపీకి వెళతారా? లేక సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తారా? అనేది చర్చ జరుగుతుంది.


N.V.S.S. Prabhakar: కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారు