Stephen Raveendra: నవంబర్ 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ.. పోలీసులు ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Raveendra: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నామినేషన్ కేంద్రాల చుట్టూ నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీపీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద నాలుగు అంచెల బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరులు అధిక సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు సూచించారు.
ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆర్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో భాగంగా ఓటర్లను మోసగించే డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను నిరోధించే విధంగా వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ (ట్రాఫిక్) కె.నారాయణ్ నాయక్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, మాదాపూర్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎలక్షన్ సెల్ డీసీపీ అశోక్ కుమార్ తో పాటు ఏసీపీలు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
Also Read
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!