Assault on Cab Driver: అరగంట ఆలస్యం అయిందని ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న ఆదివారం అర్ధ రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్ పల్లి కి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రాఫిక్ ప్రభావమో లేక, ఏ ఇతర కారణమో ఓలా క్యాబ్ డ్రైవర్ ఆర గంట ఆలస్యంగా వచ్చాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ ను వినయ్ రెడ్డి నిలదీసాడు. ఇద్దరి మద్య మాటా మాటా పెరగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో.. వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా డ్రైవర్ పై దాడి చేసారు. తీవ్రంగా కొట్టారు. దీంతో క్యాబ్ డ్రైవర్ దాడి విషయాన్ని క్యాబ్ యజమానికి ఫోన్ ద్వారా తెలిపారు.
read also: Ys Sharmila: నేడు గవర్నర్ తో వైఎస్ షర్మిల భేటి..! పలు అంశాలపై ఫిర్యాదు?
ఈ విషయాన్ని తెలుసుకున్న యజమాని హుటాహుటిన ఉప్పర్ పల్లి కి చేరుకుని వినయ్ రెడ్డి తో వాగ్వాదానికి దిగాడు. ఇలా దాడికి దిగడం సరైన పద్దతి కాదని తెలిపారు. దీంతో వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా యజమానిని సైతం చితకబాదారు. ఉదయం 4 గంటల వరకు ఓ రూమ్ లో బంధించి దాడి చేసారు. అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న క్యాబ్ డ్రైవర్, యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్, ఓనర్ కు తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే డ్రైవర్ ఫైజల్ పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.
read also: Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్..
2021 డిసెంబర్ 17లో ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ బైక్ కు దారి ఇవ్వలేదని ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ చొక్కా పట్టుకుని వీరంగం సృష్టంచింది. అతనిని అందరిముందు చెంప చెల్లు మనిపించింది. అక్కడున్న ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దుర్భాషలాంది. ఈ ఘటన సంబందించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ విషం కాస్త వైరల్ గా మారింది. ముందు ట్రాఫిక్ వుండటంతో.. క్యాబ్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేక పోయాడని దీంతో ఆమహిళ ఇలా చేయడం దారుణమని నెటిజన్లు కామెంట్ల చేసారు. పోలీసులు ఈ ఘటనపై సీరియస్ తీసుకుని ఆ మహిళపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Rishi Sunak Opinion on His wife: మా ఆవిడపై నాకు కోపం.. ఎందుకంటే?
